హైదరాబాద్: 28°C
వార్తలు

'అంతరాలయంలో సెల్ ఫోన్ నిషేధించాలి'

PLD: అమరావతి శ్రీ అమరేశ్వర స్వామి దేవస్థానం అంతరాలయంలో సెల్‌ఫోన్ వినియోగాన్ని నిషేధించాలని భక్తులు కోరారు. హైకోర్టు న్యాయవాది బెల్లపు సుబ్బారావు, అప్పికట్ల శ్రీనివాసరావు ఆలయ ఇన్‌ఛార్జ్ ఈవో పీ. సైదమ్మబాయ్‌కు వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఈవో, సెల్‌ఫోన్ నిషేధంతో పాటు డ్రెస్ కోడ్ అమలు చేసి, ఆలయ నిర్వహణను వాకీటాకీల ద్వారా కొనసాగిస్తామని తెలిపారు.