హైదరాబాద్: 28°C
వార్తలు

విమానాలను ఢీకొన్న సపోర్టింగ్‌ పరికరాలు

ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో భారీ వర్షం కారణంగా గందరగోళం నెలకొంది. ఈదురుగాలులు బీభత్సం సృష్టించడంతో ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 2లో గ్రౌండ్ సపోర్ట్ పరికరాలు వాటంతటవే కదులుతూ వెళ్లి నిలిపి ఉంచిన మూడు ఎయిరిండియా విమానాలను ఢీకొట్టినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఆ విమానాలకు మరమ్మతులు చేపట్టినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతున్నాయి.