హైదరాబాద్: 28°C
క్రీడలు

గురువును మరువని హిట్‌మ్యాన్

జీవితంలో ఎంత ఎదిగినా మూలాలను మరువకూడదని టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ నిరూపించాడు. నిన్న వాంఖడే స్టేడియంలో ముంబై T20 లీగ్ మ్యాచ్‌కు వెళ్తుండగా, తన చిన్ననాటి కోచ్ దినేశ్ ల్యాడ్ దంపతులు కనిపించారు. తొందరలో ఉన్నప్పటికీ, హిట్‌మ్యాన్ వెనక్కి వచ్చి వారిని ఆప్యాయంగా పలకరించి, ముచ్చటించారు. గురువుపై రోహిత్ చూపిన ఈ గౌరవానికి అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.