GNTR: మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి క్యాంపు ఆఫీసులో ప్రజలను కలిశారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి నుంచి పలు అర్జీలను స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని మనోహర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
వార్తలు
సమస్యల పరిష్కారమే లక్ష్యం: నాదెండ్ల


