డెలివరీ కోసం ఉపయోగిస్తున్న విద్యుత్ వాహనాల సంఖ్యను 2030 కల్లా రెట్టింపు చేయాలని ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భావిస్తోంది. భారత్‌లో ఇప్పటికే 10,000కి పైగా విద్యుత్ వాహనాలను వినియోగిస్తుండగా.. మరో 1,000 ట్రక్కులను అందుబాటులోకి తేవాలని చూస్తోంది. కాగా, 2022లో విద్యుత్ వ్యాన్ల వినియోగాన్ని ప్రారంభించిన అమెజాన్.. 2025 చివరికి ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్యను 50,000కు చేర్చింది.
వ్యాపారం
డెలివరీ కోసం లక్ష విద్యుత్ వ్యాన్లు: అమెజాన్


