గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు మరోసారి షాక్ తగిలింది. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరను రూ.29 మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మూడు నెలల వ్యవధిలో డొమెస్టిక్ సిలిండర్ ధర పెరగడం ఇది రెండోసారి. హైదరాబాద్‌లో 14.2 కిలోల LPG సిలిండర్ ధర రూ.965 నుంచి రూ.994కు చేరింది. పెంచిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి.


