TG: సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లోని మల్కాపూర్ లో ఓ మహిళపై వీధి కుక్క దాడి చేసింది. మహిళ రోడ్డుపై వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చి దాడి చేసింది. తప్పించుకునే ప్రయత్నం చేసినా వదలకుండా.. నాలుగు చోట్ల కరిచింది. చివరికి రాయి తీసుకుని కొట్టబోగా.. అక్కడి నుంచి కుక్క పారిపోయింది. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
వార్తలు
వీధి కుక్క బీభత్సం.. మహిళపై దాడి


