హైదరాబాద్: 28°C
వార్తలు

ఈ నెల 10న జిల్లాస్థాయి చెస్ ఎంపికలు

నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఈ నెల 10వ తేదీన జిల్లాస్థాయి అండర్ 15 బాల బాలికల చెస్ ఛాంపియన్‌షిప్ పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా చెస్ అసోసియేషన్ సెక్రటరీ మస్తాన్ బాబు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోటీలో పాల్గొనే క్రీడాకారులు ఈ నెల 8వ తేదీలోపు 80963 28326, 96033 45326 నంబర్లకు ఫోన్ చేసి పేర్లను నమోదు చేసుకోవాలన్నారు.