హైదరాబాద్: 28°C
వార్తలు

'నాటకాలు జీవితాలను ప్రభావితం చేస్తాయి'

నాగర్‌కర్నూల్‌లో నిన్న రాత్రి నిర్వహించిన మూడు రోజుల పద్య నాటకోత్సవాల ముగింపు కార్యక్రమంలో అడిషనల్ జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) అమరేందర్ పాల్గొన్నారు. సాంఘిక, ఇతిహాస నాటకాలు ప్రజల జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతూ విలువలను చేరవేస్తాయని అన్నారు. ఇతిహాసాలను ప్రజలకు చేరవేయడంలో నాటకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, కళాకారులను ప్రోత్సహించడం అవసరమని పేర్కొన్నారు.