హైదరాబాద్: 28°C
వార్తలు

అడ్వాన్స్ టెన్త్ పేపర్ల వాల్యూయేషన్‌కు ఏర్పాట్లు

అన్నమయ్య: జిల్లాలో అడ్వాన్స్ టెన్త్ పరీక్షల పేపర్ల స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ సోమవారం నుంచి రెండు రోజుల పాటు నిర్వహించనున్నట్లు డీఈవో సుబ్రహ్మణ్యం తెలిపారు. రాయచోటిలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో సోమ, మంగళవారాల్లో 2,666 మంది విద్యార్థుల పరీక్ష పత్రాలను మూల్యాంకనం చేయనున్నట్లు చెప్పారు. ఇందు కోసం 150 మంది ఉపాధ్యాయులు, 67 మంది సహాయక సిబ్బందిని నియమించారు.