KMM: నేలకొండపల్లి మండలంలోని బైరవునిపల్లి, రాయగూడెం, చెరువుమాధారం, పైనంపల్లి, సింగారెడ్డిపాలెం, నాచేపల్లి పాఠశాలల్లో తాత్కాలిక టీచర్లు, ఆయాల నియామకానికి దరఖాస్తులు చేసుకోవాలని ఎంఈవో బి. చలపతిరావు తెలిపారు. జూన్ 8, 9 తేదీల్లో MRC కేంద్రంలో దరఖాస్తులు సమర్పించాలని కోరారు. టీచర్‌కు రూ. 8,000, ఆయాకు రూ. 6,000 గౌరవ వేతనం ఉంటుందని ఆయన తెలిపారు.
వార్తలు
నేలకొండపల్లి మండలంలో టీచర్, ఆయా పోస్టుల భర్తీ


