హైదరాబాద్: 28°C
వార్తలు

చిత్తూరుకు బాలల హక్కుల పరిరక్షణ కమిషన్

CTR: ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఈనెల 10, 11 తేదీల్లో చిత్తూరు జిల్లాలో పర్యటించనుంది. కమిషన్ ఛైర్మన్ వేటుకూరి సూర్యనారాయణరాజు, సభ్యులు జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. 10న మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు చిత్తూరు శిశువిహార్, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి (జీజీహెచ్) స్కానింగ్ సెంటర్లను వీరు పరిశీలిస్తారని ప్రకటనలో పేర్కొన్నారు.