హైదరాబాద్: 28°C
వార్తలు

చిరుత ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

అన్నమయ్య: పీలేరు మండలం మొరవపల్లి పరిసర ప్రాంతాల్లో చిరుత పులి సంచరించినట్లు గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన అటవీశాఖ సిబ్బంది చిరుత సంచరించినట్లు ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లభించలేదని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.