హైదరాబాద్: 28°C
వార్తలు

ఫిరంగిపురం మంచినీటి చెరువుకు సాగర్ నీటి జలకళ

GNTR: నాగార్జునసాగర్ నుంచి విడుదలైన జలాలు ఫిరంగిపురం ప్రధాన మంచినీటి చెరువుకు చేరుకోవడంతో చెరువు సరికొత్త జలకళను సంతరించుకుంది. ఎండల తీవ్రత కారణంగా అడుగంటిపోయిన ఈ చెరువులోకి నీరు చేరడంతో గ్రామంలో తాగునీటి కొరత ఉండదని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి అవసరాలకు ఇబ్బందులు లేకుండా నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు.