MLG: వాజేడు మండలం జగన్నాథపురం గ్రామంలోని వన నర్సరీని శనివారం ఎంపీడీవో కృపాకర్ పరిశీలించారు. మొక్కల పెంపకం, నిర్వహణను తనిఖీ చేసి సిబ్బందిని అభినందించారు. మొక్కల సంరక్షణను మరింత జాగ్రత్తగా చేపట్టాలని పంచాయతీ కార్యదర్శి సలీంపాషాకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో సత్యేంద్రకుమార్, పంచాయతీ ప్రతినిధులు పాల్గొన్నారు.
వార్తలు
వన నర్సరీని పరిశీలించిన ఎంపీడీవో


