TG: రంగారెడ్డి జిల్లా లింగారెడ్డిగూడ వద్ద ప్రమాదం జరిగింది. జేసీబీ, ప్రైవేటు బస్సును బైకు ఢీకొట్టింది. ఈ ఘటనలో 16 ఏళ్లలోపున్న ఇద్దరు బాలురు అక్కడికక్కడే మృతి చెందారు. బైకు అతివేగంతో నడిపి అదుపుచేయలేకపోవడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
క్రైమ్
రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మైనర్లు మృతి


