NDL: నంద్యాల మండలం భీమవరం సమీపంలోని పెట్రోల్ బంకు పరిసరాల్లో గుర్తు తెలియని మహిళ సంచరిస్తున్నట్లు శనివారం సీఐ ఈశ్వరయ్య తెలిపారు. ఆమె తన పేరు సంతోషి అని హిందీలో చెబుతోందని, 35 నుంచి 40 ఏళ్ల వయస్సు ఉండి మానసిక స్థితి సరిగ్గా లేనట్లు గమనించామన్నారు. ఈమె బంధువులు ఎవరైనా గుర్తిస్తే వెంటనే నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
వార్తలు
నంద్యాలలో గుర్తు తెలియని మహిళ సంచారం


