హైదరాబాద్: 28°C
వార్తలు

శ్రీ ఏడుపాయలలో భాను వాసరే ప్రత్యేక పూజలు

MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల దేవాలయంలో ఆదివారం వన దుర్గమ్మకు భాను వాసరే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక జ్యేష్ట మాసం బహుళపక్షం సప్తమి తిథి పురస్కరించుకొని అమ్మవారికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. నేడు సెలవు దినం కావడంతో భక్తులు ఈ తెల్లవారుజాము నుంచి ఆలయానికి తరలివచ్చి అమ్మవారికి పూజలు చేసి దర్శించుకుంటున్నారు.