హైదరాబాద్: 28°C
క్రీడలు

వైభవ్ ఎంపిక నన్ను ఆశ్చర్యపరచలేదు: గవాస్కర్

వైభవ్ సూర్యవంశీ భారత టీ20 జట్టుకు ఎంపికైన విషయం తెలిసిందే. అయితే, అతడి ఎంపిక తనను ఆశ్చర్యపరచలేదని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. 'వైభవ్ ఎంపిక ముందు నుంచీ అనుకున్నదే. అతడి ఫామ్‌ను.. అతడు సాధించిన పరుగులను చూడండి. దీని తర్వాత కూడా వైభవ్‌ను ఎంపిక చేయకుండా ఉంటారా? అతడు.. డ్రెస్సింగ్ రూమ్ నుంచి చాలా నేర్చుకుంటాడు' అని గవాస్కర్ వెల్లడించాడు.