హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

MLG: ములుగు 132 కేవీ సబ్‌స్టేషన్‌లో అత్యవసర మరమ్మత్తుల నేపథ్యంలో ఇవాళ ఉదయం 6:30 గంటల నుంచి 10గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు డీఈ పులుసం నాగేశ్వరరావు తెలిపారు. ములుగు, ఖాసీందేవిపేట, పత్తిపల్లి, అబ్బాపూర్, మల్లంపల్లి, రామచంద్రాపురం, పందికుంట, కోడిశాలకుంట, లక్ష్మీదేవిపేట, నర్సాపూర్, వెంకటాపూర్ సబ్‌స్టేషన్ల పరిధి ప్రాంతాలలో అంతరాయం కలుగుతుందన్నారు.