హైదరాబాద్: 28°C
వార్తలు

ఎమ్మెల్యేను కలిసిన హీరో హరిహరన్

అన్నమయ్య: మదనపల్లి నియోజకవర్గం పెంచుపాడు గ్రామానికి చెందిన హ్యాపీ జర్నీ ఫేమ్ సినీ హీరో హరిహరన్ ఉత్తమ ఎన్టీఆర్ అవార్డు అందుకున్న సందర్భంగా ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కార్యాలయంలో హరిహరన్‌ను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. స్థానిక యువత ప్రతిభతో ముందుకు రావడం గర్వకారణమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.