హైదరాబాద్: 28°C
వార్తలు

పీజీ వైద్యులకు ఓరియంటేషన్ కార్యక్రమం

కర్నూలు మెడికల్ కళాశాలలో ప్రథమ సంవత్సరం పీజీ వైద్యులకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ చిట్టి నరసమ్మ పాల్గొన్నారు. వైద్య నైపుణ్యాలతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ, రోగి భద్రత, సేవాభావం ప్రతి వైద్యుని విజయానికి ఎంతో ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. ఎన్ఎంసీ మార్గదర్శకాలకు అనుగుణంగా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు.