హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: నూతన తహసీల్దార్‌ను కలిసిన రెడ్ క్రాస్ ప్రతినిధులు

BPT: కర్లపాలెం మండల నూతన తహసీల్దార్‌‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన డీ.రవీంద్ర కుమార్ కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. తహసీల్దార్‌ కార్యాలయంలో ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సంస్థ ద్వారా చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను ఆయనకు వివరించి, భవిష్యత్తులోనూ తమ సహకారం ఉంటుందన్నారు.