VSP: ఏయూ వృక్షశాస్త్ర విభాగంలో ప్రతిభ కనబరిచే విద్యార్థులకు ప్రోత్సాహంగా “ఏయూ బోటనీ అలుమ్ని 1976–78 గోల్డ్ మెడల్”ను ఏర్పాటు చేసినట్లు విభాగాధిపతి ఆచార్య డి. సంధ్య దీపిక తెలిపారు. 1976–78 బ్యాచ్ పూర్వ విద్యార్థులు రూ.3 లక్షల ఎండోమెంట్ నిధిని ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
వార్తలు
ఏయూలో బోటనీ అలుమ్ని గోల్డ్ మెడల్ ఏర్పాటు


