హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మధ్యాహ్నం తిన్న వెంటనే నిద్రపోతున్నారా? 

మధ్యాహ్న భోజనం తర్వాత మెదడుకు రక్తప్రసరణ తగ్గి నిద్ర రావడం సహజం. అయితే తిన్న వెంటనే పడుకుంటే అజీర్ణం, గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి. బరువు కూడా పెరుగుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే తిన్న తర్వాత కొద్దిసేపు నడిచి ఆపై అరగంట నుంచి గంట మాత్రమే విశ్రాంతి తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు.