హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత్-A జట్టులో తెలుగు కుర్రాడు

ఆఫ్ఘాన్, శ్రీలంకతో ఈనెల 9 నుంచి జరగబోయే ట్రై సిరీస్‌లో భారత్-A తరఫున తెలుగు కుర్రాడు షేక్ రషీద్ బరిలోకి దిగబోతున్నాడు. APలోని గుంటూరు జిల్లాకు చెందిన రషీద్.. టాప్ ఆర్డర్ బ్యాటర్, లెగ్ బ్రేక్ బౌలింగ్ కూడా చేయగలడు. గతంలో 2022 U-19 WCను గెలిచిన భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. 27 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడిన రషీద్.. 47 సగటుతో 1831 పరుగులు చేశాడు.