హైదరాబాద్: 28°C
క్రీడలు

సచిన్ రికార్డుపై కన్నేసిన సూర్యవంశీ

15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టీమిండియా అరంగేట్రానికి సిద్ధమయ్యాడు. అందరూ ఊహించినట్లుగానే సెలక్టర్లు అతడికి ఇంగ్లండ్, ఐర్లాండ్ సిరీస్‌లో చోటు కల్పించారు. జూన్ 26న ఐర్లాండ్‌తో జరిగే తొలి టీ20లో వైభవ్ డెబ్యూ చేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే, క్రికెట్ గాడ్ సచిన్ (16 ఏళ్ల 205 రోజులు) రికార్డును బ్రేక్ చేస్తూ.. వైభవ్ ప్రపంచ రికార్డును సృష్టించనున్నాడు.