హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరణ

GNTR: పెదవడ్లపూడి సమీప చైతన్య నగర్‌లో ఈ నెల 7న సాయంత్రం 5 గంటలకు వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరణ జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వంగవీటి రాధా విచ్చేసి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ముందుగా ఆదివారం సాయంత్రం 4 గంటలకు మంగళగిరి ఫ్లైఓవర్ నుంచి భారీ ర్యాలీ నిర్వహిస్తారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని కాపు జేఏసీ నేత రాజేష్ పిలుపునిచ్చారు.