హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రారంభానికి నోచుకోని సచివాలయ భవనం

PPM: కురుపాం మండలం పి.లేవిడి గ్రామంలో కొత్తగా నిర్మించిన సచివాలయ భవనం ప్రారంభానికి నోచుకోకుండా నిరుపయోగంగా ఉంది. ప్రస్తుతం ఉద్యోగులు శిథిలావస్థకు చేరుకున్న పాత పంచాయతీ భవనంలో విధులు నిర్వహిస్తున్నారు. వర్షాల సమయంలో భవనం కూలిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త సచివాలయ భవనాన్ని ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు.