సత్యసాయి: సోమందేపల్లి మండలంలోని చాలాకూరు–గుడిపల్లి సెక్టార్ పరిధిలో అంగన్‌వాడీ కార్యకర్తలకు బాలల అభివృద్ధి, పోషణ అంశాలపై శనివారం శిక్షణ నిర్వహించారు. చిన్నారుల జీవితంలో తొలి వెయ్యి రోజులు అత్యంత కీలకమని, ఈ దశలో సరైన పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ అందించడం ద్వారా వారి శారీరక, మానసిక వికాసానికి బలమైన పునాది ఏర్పడుతుందని సీడీపీవో శాంతలక్ష్మి వివరించారు.
వార్తలు
చిన్నారుల భవిష్యత్‌కు తొలి వెయ్యి రోజులే కీలకం: సీడీపీవో


