హైదరాబాద్: 28°C
వార్తలు

LOCని అందజేసిన ఎమ్మెల్యే

VSP: గాజువాక 72వ వార్డు శ్రీనగర్ అఫీషియల్ కాలనీకి చెందిన ఎలిమిశెట్టి భాస్య ప్రియ అనే యువతి గత కొంతకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతోంది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. సీఎం వెంటనే స్పందించి వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 10 లక్షల LOCని మంజూరు చేశారు. ఈ మొత్తాన్ని ఇవాళ ఎమ్మెల్యే ఆమె తల్లికి అందజేశారు.