హైదరాబాద్: 28°C
క్రైమ్

అగ్ని ప్రమాదంలో ధాన్యం, గడ్డి వాము దగ్ధం

కోనసీమ: అల్లవరం మండలం తాడికోన గ్రామం జగనన్న కాలనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ రైతు పొలంలో శనివారం మధ్యాహ్నం ఆకస్మాత్తుగా మంటలు చెలరేగి ధాన్యం బస్తాలు, రెండు గడ్డివాములు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. ఎవరో కాల్చి పాడేసిన సిగరెట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు అంటున్నారు. ఫైర్ సిబ్బంది వచ్చినా పొలంలోకి వెళ్లేందుకు దారి లేకపోవడంతో సాధ్యపడలేదు.