హైదరాబాద్: 28°C
క్రైమ్

చెలరేగిన మంటలు.. కారు దగ్ధం

NLR: మర్రిపాడు మండలం కదిరి నాయుడుపల్లి సమీపంలో ఏసీ షార్ట్ సర్క్యూట్ కారణంగా కారు దగ్ధమైంది. పొద్దుటూరు నుంచి పెంచలకోనకు వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించి కారు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే కారులో నుంచి బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు.