TG: నిజామాబాద్ ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్‌లో దారుణ ఘటన జరిగింది. నర్సింగ్ విద్యార్థినిపై ట్యూటర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో సదరు విద్యార్థిని నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ క్రమంలో నిందితుడు గౌతమ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే అతన్ని విధుల నుంచి తొలగించినట్లు అధికారులు తెలిపారు.
క్రైమ్
లైంగిక వేధింపులు.. యువతి ఆత్మహత్యాయత్నం


