హైదరాబాద్: 28°C
వార్తలు

పేదలకు కొండంత అండగా సీఎంఆర్ఎఫ్

SDPT: ఆరోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కొండంత అండగా నిలుస్తుందని తంగళ్లపల్లి గ్రామ సర్పంచ్ బోయిని సంపత్ తెలిపారు. గ్రామంలో సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. వైద్య ఖర్చులు భరించలేని నిరుపేదలకు ఈ ఆర్థిక సాయం ఎంతో ఉపశమనం కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు.