హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

NGKL: అచ్చంపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రి వార్డులను కలియతిరిగి రోగులకు అందుతున్న వైద్య సేవలపై వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. నల్లమల్ల ప్రాంతం నుంచి ఎక్కువ మంది రోగులు వస్తున్న నేపథ్యంలో వారికి నిరంతరం అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన ఆదేశించారు.