PDPL: గోదావరిఖని పట్టణ శివారులోని జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి దాటాక రోడ్డు ప్రమాదం జరిగింది. పల్సర్ బైక్‌పై వెళ్తున్న ఓ యువకుడిని డీసీఎం వ్యాన్ ఢీకొట్టడంతో యువకుడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మృతుడు స్థానిక అశోక్ నగర్‌కు చెందినవాడిగా స్థానికులు గుర్తించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
క్రైమ్
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం


