KRNL: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో 2019లో డిగ్రీ కోర్సుల్లో ఫెయిలైన అభ్యర్థులకు స్పెషల్ సప్లిమెంటరీ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు వీసీ వెంకటబసవరావు తెలిపారు. ఈ నెల 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఒక్కో సబ్జెక్టుకు రూ.1,500 రుసుము నిర్ణయించినట్లు వెల్లడించారు. అభ్యర్థులు సంబంధిత కళాశాల ప్రిన్సిపల్‌ను సంప్రదించి పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
వార్తలు
ఆర్‌యూ స్పెషల్ సప్లిమెంటరీ నోటిఫికేషన్


