హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: కనకదుర్గమ్మ ఆలయంలో వైభవంగా పల్లకి సేవ

NLR: పట్టణంలోని శ్రీకనకదుర్గమ్మ ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి అభిషేకాలు చేశారు. ప్రత్యేక పుష్పాలంకరణతో అమ్మవారి పల్లకి సేవను జరిపారు. భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త మండలి అధ్యక్షుడు చంగల్ రాయుడు, గౌరవ అధ్యక్షుడు పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరిగాయి.