GNTR: చుట్టుగుంట జీటీ రోడ్డులోని పురాతన మసీద్-ఏ-తాజ్ గోడలు, షాపుల తొలగింపును వ్యతిరేకిస్తూ శనివారం ముస్లింలు నిరసన తెలిపారు. డ్రైనేజీ పేరుతో వీటిని కూల్చేస్తామని కమిషనర్ మొండికేయడాన్ని తప్పుబట్టారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ వెంటనే స్పందించి మసీదు ఆస్తులను కాపాడాలని కోరారు. లేదంటే తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని గట్టిగా హెచ్చరించారు.
వార్తలు
మసీదు కూల్చివేతపై ఆందోళన


