గద్వాల జిల్లా టౌన్ పోలీస్ స్టేషన్ ప్రహరీ గోడ పక్కన ప్రధాన రహదారి చెత్తకుప్పగా మారింది. కొందరు నిర్లక్ష్యంగా రోడ్డుపైనే వ్యర్థాలు వేయడం, మున్సిపల్ సిబ్బంది వాటిని సకాలంలో తొలగించకపోవడంతో తీవ్ర దుర్వాసన వస్తోంది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఈ చెత్తను తొలగించాలని కోరుతున్నారు.
వార్తలు
ప్రహరీ గోడ పక్కనే చెత్త.. మరి సామాన్యుల పరిస్థితి ఏంటి..!


