కోనసీమ: మామిడికుదురు తహసీల్దారుగా సీఎస్ రాజు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. సఖినేటిపల్లి కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దారుగా పనిచేస్తున్న ఆయన, పదోన్నతిపై ఇక్కడకు బదిలీ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. గత అనుభవంతో ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. కార్యాలయ సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.
వార్తలు
మామిడికుదురు తహసీల్దారుగా రాజు


