హైదరాబాద్: 28°C
క్రీడలు

ప్రజ్ఞానందపై ప్రధాని మోదీ ప్రశంసలు

నార్వే చెస్‌ టోర్నీ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుని భారత గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద సరికొత్త చరిత్ర సృష్టించాడు. దీంతో ప్రధాని మోదీ ప్రజ్ఞానందను అభినందిస్తూ 'X' వేదికగా ఓ పోస్ట్ చేశారు. 'ఈ అద్భుతమైన ఘనత సాధించినందుకు ప్రజ్ఞానందకు అభినందనలు. అతని అసాధారణ ప్రతిభకు ఈ విజయం ఒక మైలురాయి. అతడు భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలి' అని పేర్కొన్నారు.