హైదరాబాద్: 28°C
వార్తలు

ఓటర్ల నమోదుపై ఎమ్మెల్యే దిశానిర్దేశం

ATP: ఎస్ఐఆర్ ప్రక్రియపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు. ఈ నెల 12వ తేదీ లోపు బీఎల్ఏలు హౌస్ మ్యాపింగ్ పూర్తి చేయాలని సూచించారు. ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో 100 శాతం ఓటర్లు నమోదు కావాలన్నారు. గత ప్రభుత్వంలో ఓట్ల విషయంలో జరిగిన అక్రమాలను గుర్తించి, క్షేత్రస్థాయిలో నాయకులు చురుగ్గా పనిచేయాలని పిలుపునిచ్చారు.