కడప జిల్లాలోని ఓనిపెంట బాలికల BC గురుకుల పాఠశాలను జూనియర్ కళాశాలగా అప్‌గ్రేడ్ చేశారు. ఈ కళాశాలలో MCPC, BIPC గ్రూపులు అందుబాటులో ఉన్నాయని ప్రిన్సిపాల్ తెలిపారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందదలచిన అర్హత గల విద్యార్థినులు జూన్ 8వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలని కళాశాల యాజమాన్యం కోరింది.
వార్తలు
గురుకుల జూనియర్ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు


