హైదరాబాద్: 28°C
వార్తలు

మంత్రిని కలిసిన రాయచోటి నూతన ఎమ్మార్వో

అన్నమయ్య: రాయచోటి నూతన ఎమ్మార్వోగా బాధ్యతలు స్వీకరించిన జానపాటి యామిని శనివారం బొరెడ్డిగారిపల్లెలో మంత్రి రాంప్రసాద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. మండల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సేవల అందింపుపై వారు చర్చించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పేర్కొన్నారు.