హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

లోలసనం వల్ల కలిగే ఉపయోగాలు

యోగాలో ఒక ముఖ్యమైన భంగిమ అయిన లోలసనం (పెండెంట్ పోజ్) వల్ల శరీరాన్ని అదుపులో ఉంచుకోవడానికి, దృఢంగా మార్చడానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పొత్తికడుపు, ఉదర కండరాలు బాగా బలపడతాయి. కొవ్వును తగ్గించి, శరీరాన్ని ఆకృతిలో ఉంచడానికి సహాయపడుతుంది. మణికట్టు, భుజాలు, చేతులు (ముఖ్యంగా ముంజేతులు) బలంగా మారుతాయి. వెన్నెముకను సాగదీసి, వెన్నునొప్పి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.