హైదరాబాద్: 28°C
వ్యాపారం

'అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు'

కృష్ణా: జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పెడన మున్సిపల్ కార్యాలయంలో బూత్ స్థాయి అధికారులతో (BLO) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (SSR) ప్రక్రియపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పెడన మున్సిపాలిటీలో ప్రస్తుతం కేవలం 66 శాతం ఓటర్ల జాబితా మ్యాపింగ్ మాత్రమే పూర్తవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.