హైదరాబాద్: 28°C
వ్యాపారం

మానవ మనుగడకు AI ముప్పు: ఆంథ్రోపిక్

ఆంథ్రోపిక్ సీఈవో డారియో అమోడెయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మానవ మనుగడకు AI ముప్పుగా మారబోతోందని అన్నారు. ఏఐపై నియంత్రణ వ్యవస్థ అవసరమని తెలిపారు. ముందుగా ఏఐని కంట్రోల్ చేసే వ్యవస్థను రూపొందించి.. ఆ తర్వాత ఏఐని డెవలప్ చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణ వల్ల భవిష్యత్‌లో తీవ్ర ఉద్యోగ సంక్షోభం పొంచి ఉందని డారియో ఇప్పటికే హెచ్చరించారు.