హైదరాబాద్: 28°C
క్రీడలు

సూర్యవంశీ టెస్ట్ క్రికెట్ ఆడాలి: అశ్విన్

15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ టెస్ట్ క్రికెట్ ఆడాలని మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఆకాంక్షించాడు. అయితే యువ క్రికెటర్లు రెడ్ బాల్ క్రికెట్ ఆడటానికి ఆసక్తి చూపడం లేదన్నాడు. బలవంతంగా ఏ ఫార్మాట్‌ను రుద్దలేమని తెలిపాడు. ఇష్టం లేకుండా ఒత్తిడి చేస్తే ఫలితాలు రావని అభిప్రాయపడ్డాడు. కాగా, ప్రస్తుతం వైభవ్ భారత్-A జట్టు తరఫున AFG, SL వన్డే ట్రైసిరీస్‌లో ఆడబోతున్నాడు.